కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

0
61

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఏడాది వయసున్న ఒక చిన్నారి ప్రాణం పోయింది. ఈ ఘటన తెలంగాణ, నెక్కొండ మండలంలో ఆదివారం ఉదయం వేకువజామున జరిగింది. బదావత్ మాలు-కవిత దంపతులకు ఏడాది వయసున్న మణికంఠ అనే బాబు ఉన్నాడు. మణికంఠ తండ్రి అయ్యప్పమాల వేసుకున్నాడు. దీంతో ఇంట్లో నిత్యం పూజలు, దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం చేస్తున్నారు. ఇక మాల వేసుకున్నవారు ఇంట్లో ఉంటే మహిళలకు విపరీతమైన పని ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పదినెలల చిన్నారి ఏడుస్తుంటే ఊరడించడానికి తల్లి.. చిన్నారికి కొబ్బరి ముక్క చేతిలో పెట్టింది. దీంతో ఆ బాలుడు ఆడుకుంటూ నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఉండగా.. ఒక్క సారిగా ఆ గొంతులో అడ్డుపడింది. దీంతో ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే చిన్నారి మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలే తండ్రి చాక్లెట్ ఇవ్వడంతో అదికాస్త గొంతులో చిక్కుకుని చిన్నారి మృతి చెందాడు. నవంబర్ 27న ఇలాంటి ఘటనే పిన్నవారి వీధిలో చోటు చేసుకుంది. ఆ ఘటనలో చాక్లెట్ గొంతులో ఇరుక్కోవడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి సందీప్ తండ్రి ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. అక్కడినుంచి పిల్లల కోసం చాక్లెట్లు తెచ్చాడు. ఆ చాక్లెట్ ను స్కూలుకు తీసుకువెళ్లిన చిన్నారి.. తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. మరో ఘటనలో ఓ వ్యక్తి మాంసాహారం భుజిస్తుండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా అది వెలికి రాలేదు. దీంతో ఊపిరి ఆడక అతను మరణించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here