చీ.. చీ.. మెట్రో లిఫ్ట్‌లో ఇవేం పాడు పనులు.. మహిళను వేధించిన యువకుడు అరెస్ట్

0
89

మ‌హిళ‌లు, చిన్నారుల‌పై లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌ల‌కు బ్రేక్ ప‌డ‌టం లేదు. ఢిల్లీ మెట్రో స్టేష‌న్‌లో మ‌హిళ‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్‌లో ఏప్రిల్‌ 4న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఏప్రిల్ 4న ఢిల్లీ మెట్రో స్టేషన్‌లోని లిఫ్ట్‌లో మహిళను లైంగికంగా వేధించినందుకు 26 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న నిందితుడు రాజేష్ కుమార్, దక్షిణ ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్‌లో లిఫ్ట్‌లో తన ప్రైవేట్ భాగాలను బయటపెట్టి, వాటితో పాటు ఒక మహిళను తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. వెంటనే గట్టిగా అరిచింది.

ఈ విషయంపై ఢిల్లీ మెట్రో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ, లోకల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రాజేష్‌ని పట్టుకున్నారు. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన మహిళ అతని చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజేష్ మెట్రో రైలు ఎక్కకుండానే పారిపోయాడు. ఢిల్లీ మెట్రో పోలీసులు వేధింపులకు సంబంధించిన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here