రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో లీడర్‌షిప్ అవార్డ్స్ ఈవెంట్ ఘనంగా జరిగింది. వివిధ రంగాలలో విశిష్ట ప్రతిభ , విశేష సేవలు అందించిన మరియు అందిస్తున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించడానికి అవార్డ్స్ ఫర్ లీడర్ షిప్ పేరున వారిని సన్మానించి వారి ప్రసంగాల ద్వారా వారు సమాజానికి మరియు ప్రజల హితానికి చేసిన కృషిని గుర్తిస్తూ మరియు భవిష్యత్తులో చేయబోతున్న కార్యక్రమాలను యువత మరియు విద్యార్థులు తెలుసుకొని ప్రభావితం అవుతారనే ఒక మంచి ఉద్దేశంతో విద్యాసంస్థల యాజమాన్యం LEADERSHIP అవార్డ్స్ 2022 ” అనే అంశం ద్వారా లీడర్‌షిప్ అవార్డులను అందజేయడానికి ఈరోజు వారిని ఆహ్వానించింది. ఈ కార్యక్రమం ద్వారా విభిన్న రంగాలలో వారు సమాజానికి చేసిన కృషిని తద్వారా సమాజం పొందిన లబ్దిని పరిచయం చేస్తూ తద్వారా ఉత్సాహవంతులైన యువతను ఆదిశగా ప్రేరేపించే విధంగా ఉండాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, అవార్డు గ్రహీత ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్మాట్లాడుతూ “అనుభవాన్ని పంచుకునే నాయకుడు ఉజ్వల భవిష్యత్తును నిర్ధారిస్తాడు అని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అజయ్ మిశ్రా అవార్డు గ్రహీతలను ఉద్దేశించి మాట్లాడారు. పనితీరులో అంతిమ స్థాయికి చేరుకోవడానికి శ్రేష్ఠతకు పూర్తి నిబద్ధత చాలా ముఖ్యమైనది ” అని అన్నారు . గురునానక్ యూనివర్శిటీ ఛాన్సలర్ మరియు వైస్ చైర్మన్ గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ తమ తమ రంగాలలో గొప్ప విజయాలు సాధించినందుకు అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. గురునానక్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మరియు గురునానక్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్. సైనీ స్వాగత ప్రసంగం చేసి, అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు మరియు శ్రేష్ఠత అనేది దృష్టి , అంకితభావం మరియు సంకల్పం ద్వారా మరింత పరిపూర్ణ స్థితికి చేరుకోగలదని మరియు శ్రేష్ఠత యొక్క సాధనకు అంతం లేదని అన్నారు .
గురునానక్ యూనివర్శిటీ, గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశిష్ట ప్రతిభ , విశేష సేవలు అందించిన వారికి అవార్డులు అందచేసింది. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు : పద్మశ్రీ డా. కె. నారాయణ, ఇండియన్ రాకెట్ సైంటిస్ట్ & సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మాజీ డైరెక్టర్, పద్మశ్రీ డా. అలంపూర్ సాయిబాబా గౌడ్, నేత్ర వైద్య నిపుణుడు & దేవ్‌నార్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ పద్మశ్రీ డా. ఏజీకే గోఖలే, కార్డియాక్ సర్జన్ డా. సింగ్ నెహ్వాల్, Rtd ప్రిన్సిపల్ సైంటిస్ట్ & హెడ్ క్రాప్ ప్రొటెక్షన్ IIOR & సైనా నెహ్వాల్ యొక్క గర్వించదగిన తండ్రి. డాక్టర్ మధుసూధన్ డాక్టర్ రమేష్ శ్రీనివాసన్, గ్యాస్ట్రో హెపటాలజీ, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ డాక్టర్ సుబ్బారెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ & హెడ్, క్లినికల్ కేర్ విభాగం, అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ డాక్టర్ అషిమా శర్మ , అగర్వాల్ , ప్రొఫెసర్ & హెడ్ , ఎమర్జెన్సీ నిమ్స్ , హైదరాబాద్ డాక్టర్ విజయ కిషోర్ తౌరాని శ్రీ కిరణ్ , తెలంగాణ రైఫిల్ అసోసియేటన్ (షూటింగ్ ) సీనియర్ సాండ్రా హోర్టా , ప్రిన్సిపాల్ , సెయింట్. ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్, బేగంపేట, హైదరాబాద్. శ్రీ షేక్ కరీం డా. పి. పార్థసారధి, జాయింట్ డైరెక్టర్ – గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్. డాక్టర్ రిషి సాయల్ , అసోసియేట్ డైరెక్టర్ – గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ డాక్టర్ ఎస్.వి. రంగనాయకులు , డీన్ – ఆర్ & డి , గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ శ్రీమతి సాంబు వాసంతి వెంకటేశ్వర్లు శ్రీ ఉడుగుల ప్రవీణ్ గౌడ్ డైరెక్టర్ – ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం , డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ , డైరెక్టర్ – GNITC డాక్టర్ K. వెంకటరావు , GNIT ప్రిన్సిపాల్ డాక్టర్ S. శ్రీనాథ రెడ్డి అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు .
డైరెక్టర్ – ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం , డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ , డైరెక్టర్ – GNITC డాక్టర్ K. వెంకటరావు , GNIT ప్రిన్సిపాల్ డాక్టర్ S. శ్రీనాథ రెడ్డి అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు .