మూడుముళ్ల బంధంతో ఒక్కటైన హీరో నాగశౌర్య, అనూష జంట

0
148

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పారు. సంప్రదాయబద్ధంగా బంధుమిత్రుల సమక్షంలో బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో ఉదయం 11.25గంటలకు మూడు ముళ్లు వేశారు. వీరి కల్యాణ వేడుక బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా ఇటీవల వారి హల్దీ సెలబ్రేషన్ కలర్ ఫుల్ గా జరిగింది. అనంతరం కాక్ టెయిల్ పార్టీ జరిగింది. ఇందులో ఇరు కుటుంబాలకు చెందిన బంధు మిత్రులు పాల్గొన్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాగశౌర్య- అనూష జోడీ చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు.కొద్ది రోజుల క్రితమే నాగశౌర్య తన పెళ్లి విషయాన్ని ప్రకటించాడు. బెంగళూరుకు చెందిన అనూషను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పారు. అనూష బెంగళూరులో సొంతంగా ఓ ఇంటీరియర్ డిజైన్ సంస్థను స్థాపించారు. ఆమె కుటుంబం వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె ప్రతిభకు ఎన్నో అవార్డులు వరించాయి కూడా. బెంగళూరులో అనూషతో నాగశౌర్యకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం చెప్పారు. ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. ఈ సంవత్సరం ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సొంత బ్యానర్ లోనే నాగశౌర్య ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here