నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే.. మీ ఆడగాళ్ల గురించి మాట్లాడతా..!

0
77

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి సవాల్‌ విసిరారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. నారా లోకేష్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు.. కిరాయి గుండాలను పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నాడని మండిపడ్డారు.. పంచాయితీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి చేయలేదు.. కానీ, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు మాత్రం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. తాను కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానంటూ చాలెంజ్‌ చేశారు.. ఇక, మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే.. మీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతా.. మర్యాద ఉంటుందా? అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి

నారా లోకేష్‌ ఒక సైకో.. భూకబ్జాలు చేసే అలవాటు నారా వారికి చెల్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సాయి ప్రసాద రెడ్డి.. కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయానికి గుడ్ బై చెబుతానన్న ఆయన.. లోకేష్ పిచ్చి కూతలు కూస్తు ఉరురూ తిరుగుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. మా కుటుంబ సభ్యులు తప్పు చేస్తే ప్రజలే మమ్మల్ని శిక్షిస్తారన్నారు.. నిరసన తెలపడం మా నాయకులది తప్పే అన్నారు.. ఇక, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన చంద్రబాబు.. అర్హత లేకున్నా ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకొని తిరుగుతున్నారు అంటూ మండిపడ్డారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి.. కాగా, ఆదోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై సాయిప్రసాద్‌రెడ్డిపై శుక్రవారం రోజు మండిపడ్డారు. ఆదోని నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆ నియోజకవర్గాన్ని కేక్ పీస్‌లా పంచుకున్నారని ఆరోపించారు.. ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్‌ రెడ్డి, ఆయన భార్య, కుమారుడు మనోజ్‌రెడ్డి భూకబ్జాలు, సెటిల్‌మెంట్‌లకు పాల్పడ్డారని, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను భార్య చూసుకుంటుందంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here