28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అంకురార్పణ 

0
71

తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలకు విజయవాడ సిద్ధమవుతోంది. ఈ నెల 28వ తేదీన విజయవాడకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలయ్య రానున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు రజనీకాంత్, బాలయ్య, చంద్రబాబు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేయనున్నారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సావనీర్ కమిటీ. కార్యక్రమం నిర్వహించే ప్రాంగణంలో పనులు ప్రారంభిస్తూ భూమి పూజ చేశారు కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్, టీడీపీ నేతలు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సావనీర్ కమిటీ ‌ఛైర్మన్ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.ఈ నెల 28వ తేదీన జరిగే సభకు చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ వస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరిస్తాం అన్నారు.

ఎన్టీఆర్ వెబ్ సైట్, సావనీర్ హైదరాబాద్ లో త్వరలోనే ఆవిష్కరిస్తాం అన్నారు. ఎన్టీఆర్‌ యాప్ ను నారా లోకేష్ ప్రారంభిస్తారు.రామారావు గారికి రామారావుగారే సాటి.సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు. ఎనిమిది నెలలుగా మా‌ కమిటీ వీటి మీద పని చేసింది. నాజర్ అబ్బాయి బాబ్జీతో ఎన్టీఆర్‌ చరిత్ర పై బుర్ర కథ. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆరోజు ఉంటాయన్నారు. ఎన్టీఆర్‌ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ ఉంటుంది. సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ ఈ‌పుస్తకా‌న్ని రాశారు. టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ అంటేనే ఒక చరిత్ర. సినిమా, రాజకీయ రంగాల్లో ప్రత్యేక శైలి ఎన్టీఆర్ ది.

చరిత్రలో‌ గుర్తు ఉండిపోయేలా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు.కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్ ఆధ్వర్యంలో అనేక సభలు జరుపుతున్నారు.ప్రజలు కూడా ఎన్టీఆర్‌ ‌చరిత్ర గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఈ తరం కూడా ఎన్టీఆర్‌ గురించి ఆసక్తిగా వినడం గొప్ప విషయం అన్నారు కొనకళ్ళ నారాయణ. టీడీపీ సీనియర్ నేత. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో రారాజు ఎన్టీఆర్‌.పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో సిఎం అయిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. పేదలను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పధకాలు అమలు‌ చేశారు.వంద సభలు నిర్వహించి, మే 28 శత జయంతిని గొప్పగా నిర్వహిస్తున్నాం.ఈ కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు పాల్గొంటున్నారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here