బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్‌.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

0
88

బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ సోమవారం చరిత్ర సృష్టించారు. అనూహ్య పరిస్థితుల మధ్య లిజ్ ట్రస్ రాజీనామాతో నాలుక కరుచుకున్న టోరీ సభ్యులు ఈ సారి రిషి సునాక్ వైపే మొగ్గ చూపారు. దీంతో బ్రిటన్ పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. ఈ సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఇవాళ భారత వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పకనే చెప్పారు ఆనంద్ మహీంద్రా.

మహీంద్రా ట్వీట్‌ సారాంశం ఏంటంటే.. 1947లో స్వాతంత్య్రం వచ్చిన వేళ.. ఇండియన్ లీడర్స్‌ అందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, నాయకుల్లో తక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయంటూ విన్‌స్టన్‌ చర్చిల్ అవహేళన చేశారు. కానీ భారత్‌కు ఇండిపెండెన్స్‌ వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా.. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన సమాధానం చెప్పారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అంటూ ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here