అల్లూరి సీతారామరాజు జిల్లా కటాఫ్ ఏరియా అటవీ ప్రాంతంలో ఏపీ, ఒడిషా పోలీసులు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు మావోయిస్టులు ఏరివేతకు మాత్రమే పరిమితం అవ్వగా…ఇప్పుడు ఫోకస్ గంజాయి అక్రమ రవాణా, సాగుపై ఉక్కుపాదం మోపేందుకు
ఇరు రాష్ట్ర బలగాలు చేతులు కలిపాయి.
దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన గంజాయిని నిర్మూలించేందుకు కటాఫ్ ఏరి
యాలో తోటలను ధ్వంసం చేస్తున్నాయి. ఆపరేషన్ పరివర్తన మొదలుపెటగా….మల్కన్ గిరి
జిల్లా బొడపొదర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి తోటలను ధ్వంసం అవుతున్నాయి. ఒక్క శుక్రవారం నాడే 150 ఎకరాల గంజాయి తోటలను పోలీసులు నాశనం చేశారు.
గత ఏడాది ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా స్పెషల్ డ్రైవ్ ప్రా
రంభించింది. పాడేరు అటవీ ప్రాంతంలో దాదాపు 7 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం చేశారు. కేవలం గంజాయిని ధ్వంసం చేయడమే కాకుండా గిరిజనులకు ప్రత్యామ్నాయంగా వరి విత్తనాలు ఈ ఏడాది పంపిణీ చేశారు. ఇదే రీతిన ఒడిస్సా లో కూడా గిరిజనులను గంజాయి నుంచి దూరం చేయాలని ఆ ప్రభుత్వం భావిస్తుంది.