ఏపీ రాజధాని అంశం ఇంకా నలుగుతూనే ఉంది. ఒకవైపు అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ. పిటిషన్ దాఖలు చేశారు మస్తాన్ వలీ తరపు న్యాయవాది శ్రీధర్ రెడ్డి. ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని సూచించింది శివ రామకృష్ణ కమిటీ. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూనే వుంది.
ఇప్పటికే అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం,రైతులు. జనవరి 31న జరగనున్న అమరావతి రాజధాని విచారణలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రెండు పిటిషన్లు కలిపి విచారించే అవకాశం వుందని తెలుస్తోంది. త్వరలో విశాఖ నుంచి పాలన సాగిస్తామని మంత్రులు చెబుతున్న వేళ ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.