రిపోర్టర్ పై ఫైరయిన అను ఇమ్మాన్యుయేల్

0
68

నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో అను ఇమ్మాన్యుయేల్‌ తెలుగు తెరకు పరిచయమైంది. తన అభినయంతో రాజ్‌ తరుణ్‌ సరసన కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో ఆఫర్ దక్కించుకుంది. చేసిన రెండు సినిమాల్లోనూ అమ్మడును చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో ఇండస్ట్రీ దృష్టి అనుపై పడింది. వరుస ఆఫర్లు దక్కాయి. గోపీచంద్‌ సరసన ఆక్సిజన్, పవన్‌ కల్యాణ్‌- అజ్ఞాతవాసి, అల్లు అర్జున్‌ – నా పేరు సూర్య, నాగ చైతన్య సరసన శైలజారెడ్డి అల్లుడు, బెల్లంకొండ శ్రీనివాస సరసన నా అల్లుడు అదుర్స్, మహా సముద్రం ఇలా వరుసపెట్టి సినిమాలు చేసింది. కానీ ఏ సినిమా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో అమ్మడి కెరీర్ గ్రాఫ్ పడిపోయి ఫేడవుట్ అయింది. ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ అవుతుందకుంది. కానీ అవకాశాలు దక్కలేదు. మళ్లీ ఇన్నాళ్లకు అల్లు శిరీష్‌ సరసన ఊర్వశివో.. రాక్షసివో అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్‌ శిరీష్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపైనే అను ఆశలన్నీ పెట్టుకుంది. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 4న విడుదల కానుంది.

ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ విలేకరులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన అను తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘అల్లు అర్జున్ తో వర్క్ చేశారు అలాగే అల్లు శిరీష్ తో కూడా కలిసి పనిచేశారు. ఇద్దరిలో క్యూటెస్ట్ ఎవరు..? నాటీ ఎవరు..?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘వేరే ప్రశ్నలేవీ లేవా అడగడానికి..? మంచి ప్రశ్నలు అడగండి’ అంటూ నవ్వుతూనే కౌంటర్‌ వేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై శిరీష్‌ స్పందించారు. ఆ వార్తలన్నీ వట్టి పుకార్లనేనని కొట్టిపారేశారు. దీంతో నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్తలన్నీ ఫేక్‌ అని స్పష్టమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here