ఏపీ సీఎం ఎంఎస్ న్యూ యాప్.. ఇక రియల్ టైం మానిటరింగ్

0
81

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష చేపట్టారు. నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, సమస్యల సత్వర పరిష్కారం పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీని కోసం ప్రత్యేక యాప్‌ రూపకల్పన చేశారు. ‘‘ఏపీ సీఎం ఎంఎస్‌’’ (ఏపీ కన్‌సిస్టెంట్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ మున్సిపల్‌ సర్వీసెస్‌) యాప్‌తో రియల్‌టైం మానిటరింగ్‌ సాధ్యం కానుంది. మరో నెల రోజుల్లో సిద్ధం యాప్ సిద్ధం కానుంది.

రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక సదుపాయాల పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి దీని ద్వారా సాధ్యం అవుతుంది. వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ తనిఖీలు చేపడతారు. తమ పరిధిలోని సుమారు 6–7 కి.మీ. మేర రోడ్లపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేస్తారు. సమస్య ఉంటే వెంటనే ఫోటో తీసి యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసే అవకాశం వుంటుంది. గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పౌరులకూ ఫోటోలు అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించనున్నారు.

పట్టణాలు, నగరాల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను యాప్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్సించనున్నారు. ఈ సమస్యలు సంబంధిత విభాగాలకు చేరి అక్కడనుంచి పరిష్కారాలు లభిస్తాయి. వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం పై మానిటరింగ్‌ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో మంచి పురోగతి సాధ్యం అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. మున్సిపల్‌ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాల్లో తీసుకు వస్తున్న యాప్‌ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలి. నగరాల్లో, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా.. ఇతర మౌలిక సదుపాయాలు నిర్వహణ బాగుండాలన్నారు జగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here