CM YS Jagan: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడలో మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసిన వ్యక్తి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి అని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం ఆయన ఒక అడుగు వేస్తే ఆయన తనయుడిగా తాను రెండడుగులు వేశానన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం సోదర, సోదరీమణులకు సంక్షేమం నుంచి కీలక పదవుల్లో స్థానం కల్పించడం వరకూ అన్ని రంగాల్లోనూ పెద్ద పీట వేశామన్నారు. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. పలు అంశాల్లో ముస్లింల సాధికారత విషయంలో మన ప్రభుత్వంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసింది. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. లుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్ చెప్పారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించామన్నారు. సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించామన్నారు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలమని.. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం పేర్కొన్నారు.