2024లోనూ జగనన్నే మళ్ళీ సీఎం.. టీడీపీ, జనసేనపై మంత్రుల ఫైర్

0
75

పల్నాడు జిల్లాలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఊపుమీద సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు,, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళ­తాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మ­రథం పడుతున్నారు.‘ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లడం సాధారణంగా జరిగేది. కానీ అందుకు విరుద్దంగా ప్రజల వద్దకే మంత్రులు, ఎమ్మెల్యేలు రావడం అంటే అది కేవలం ఒక్క జగనన్న వల్లే సాధ్యమైంది’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు. జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా కామెంట్లు చేశారు. విపక్షాలపై ఆమె మండిపడ్డారు. 2024 లో జగనన్నను వన్స్ మోర్ అంటూ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 16 మంది ముఖ్యమంత్రు ల కన్నా మిన్నగా పాలిస్తున్నాడు జగనన్న…అలాంటి జగన్ పై నీతిమాలిన రాజకీయాలు చేయాలని చూస్తే టిడిపి ,జనసేన లను తరిమి తరిమి కొడతాం…వైసీపీ నాయకులతో మంచికి మంచి ఉంటుంది, చెడుకు చెడు ఉంటుందన్నారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విరివిగా పాల్గొంటున్నారు. పల్నాడు జిల్లాలో మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ జగనన్నే మా భవిష్యత్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. తమ ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం చేకూరిన వారి నుంచి వివరాలు, ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. పనిలో పనిగా విపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతుంటే..ప్రతిపక్షాలు కువిమర్శలు చేస్తున్నాయని మండిపడుతున్నారు. అంబటి రాంబాబు జనసేన పార్టీ ఎందుకు పెట్టారో పవన్ కళ్యాణ్ కే తెలియదన్నారు మంత్రి అంబటి రాంబాబు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనసేన పార్టీ పెట్టావా లేక చంద్రబాబు పల్లకి మో పార్టీ పెట్టాడా పవన్ సమాధానం చెప్పాలన్నారు. ఒంటరిగా పోటీ చేయలేని పార్టీలకు ఈ రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడాలన్నారు. మీకు మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి లేదంటే నన్ను ఆశీర్వదించవద్దు అని సూటిగా,దైర్యంగా చెప్పగలిగిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు అంబటి రాంబాబు. జగన్ పై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా , ఎవరు ఎంత మందితో కలిసి వచ్చిన ప్రజలు చితకొట్టి పంపిస్తారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ని మళ్ళీ మెజారిటీతో గెలిపిస్తారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here