ఒక్క జోకు కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారంటే నమ్మడం కష్టమే కాని ఇది నిజం. రెండు మూడు రోజుల క్రితం మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి గుర్తుంది కదా, సతారా జిల్లాలో ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విహారయాత్ర నిమిత్తం 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ క్రమంలో 33 మంది అక్కడికక్కడే చనిపోగా ఒకెఒక్కరు మృత్యుంజయుడుగా నిలాచాడు. బస్సు లోయలో పడుతున్నప్పుడే ప్రకాశ్ సావంత్ దేశాయ్ అనే వ్యక్తి అందులోంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. 800 అడుగుల మీద నుండి పడడంతో ఇంకెవరూ ప్రాణాలతో మిగలలేదు.
అయితే బస్సును ఒక డీప్ టర్నింగ్ తీసుకోవడంలో విఫలమయ్యి లోయలో పడిందని వార్తలు వచ్చాయి కానీ ప్రమాదం జరగడానికి అసలు కారణం ఒక జోక్ అని ఆ ప్రమాదం నుండి బయట పడిన ప్రకాశ్ సావంత్ వెల్లడించారు. బస్సులోని ఓ ప్రయాణికుడు వేసిన జోకు వల్ల అందరూ గట్టిగా నవ్వుకుంటుండగా డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడట. అదే నిమిషంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు తెలిపారు. బస్సు అదుపు తప్పి లోయలో పడబోతుండగా ముందుండే అద్దం ఊడిపోయిందని దాంతో దూకేసి పడిపోకుండా చెట్టు కొమ్మను పట్టుకున్నానని ఆలోపే బస్సు బండరాయిని తాకి ఆ తర్వాత 15 అడుగుల లోతులో ఉన్న చెట్టును ఢీకొని పూర్తిగా కిందపడిపోయిందని చెప్పుకొచ్చాడు. నిజంగా పెద్దలు ఎవరో అన్నట్టు నవ్వు చేటు చేస్తుంది అని తెలుసు కానీ మరీ ఇలా ప్రాణాలను సైతం కోల్పోవడం నిజంగా బాధాకరం.