ఇటీవల తెదేపా బహిష్కృత నేత మోత్కుపల్లి జనసేనలో చేరుతున్నారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈరోజు ఆయన నివాసంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం మీద స్పందించారు, తన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తాను ఏ పార్టీలో చేరాలన్నది ఏమీ అనుకోలేదని కానీ గౌరవం ఇచ్చే పార్టీలో మాత్రం చేరతానని, ఒకవేళ అలా చేరని పక్షంలో తనను 6సార్లు గెలిపించిన ఆలేరు నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానంటున్నారు. జనసేనలో చేరతానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అసలు ఈ వార్తలు బయటకి వచ్చాయో తనకి తెలియదని తన లక్ష్యాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. గత మూడు నెలలుగా తాను రాజకీయాల గురించి మాట్లాడటం లేదని కేవలం తన లక్ష్యం ఏమిటో మాత్రమే చెబుతున్నానని తెలిపారు. ఎన్ఠీఆర్ శిష్యుడిగా తాను ఎవరి మోచేతి నీళ్లు తాగనని చెప్పుకొచ్చారాయన.