రిమ్స్ లో ఇంజెక్షన్ వికటించి ప్రమాదానికి గురైన బాధితులను ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. నివేదిక అందిన వెంటనే చర్యలు ఉంటాయని అన్నారు.
1. రిమ్స్ ఇంజెక్షన్ వికటించిన ఘటనలో బాధితుల పరిస్థితి ఎలా ఉంది.?
20 మందికి వికటించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మొదటి రోజే ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. అందులో 9మందిని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలో చేర్చాము. అందులో ముగ్గరు చనిపోయారు. మేం చాలా ప్రయత్నం చేశాం. అందరూ వారి వారిని బ్రతికించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. కానీ దురదృష్టవశాత్తు 3 చనిపోయారు. దీనిపై సమగ్ర దర్యాప్తుకు సీఎం ఆదేశించారు. ఇందులో ఎవరు బాధ్యులైనా వారిపై కఠిన చర్యులు తీసుకుంటాం. వైద్యఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తది. చనిపోయిన వారికి రూ.5 లక్షలు సీఎం ప్రకటించారు. అంతేకాకుండా వారి పిల్లలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలబడుతుంది.
2. రిమ్స్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదు. దీనిపై మీ అభిప్రాయం..?
ఇక్కడ ఎవరూ కావాలని చేయరు. ఇది మానవ తప్పిదమా.. డ్రగ్ రియాక్షనా అనేది రిపోర్ట్స్ ను బట్టి కఠిన చర్యలు తీసుకుంటాం.
3. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.
మనం డాక్టర్సం కాదు కదా.. ఒక డ్రగ్ తయారు చేయాలంటే అన్ని పరీక్షలు జరిగాకే మార్కెట్ లోకి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ అన్ని ఆరోపణలకు విచారణ కమిటీలో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే చర్యలు ఉంటాయని అచ్చెన్నాయుడు తెలిపారు.