ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని హత్తిబెళగల్లోని క్వారీ ప్రమాద ప్రాంతాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేమంటే..
1. పవన్ గారు మీరు క్వారీ ప్రమాద ప్రాంతాన్ని సదర్శించారు కదా మీకు ఏమనిపించింది.?
మన రాష్ట్రంలో ముఖ్యంగా నేను పర్యటించిన నా అనుభవంతో గ్రహించిన విషయం ఏంటంటే.. అక్రమ క్వారీలు, వాడకూడని బ్లాస్టింగ్ పదార్ధాలు, నిబంధనలు పాటించకపోవడం వంటివి ఇటువంటి ప్రమాదాలకు కారణాలుగా చెప్పవచ్చు. అంతేకాకుండా మైనింగ్ శాఖ నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణం. సాలూరు, పాడేరు అన్నిచోట్లా ఇదే కారణంగా తెలుస్తోంది. అదే ఇక్కడి పరిస్థితి కూడా. వాళ్ళు వాడిన మెటీరియల్ తో 15 కిలోమీటర్లు పరిధిలోని పోలీస్ క్వార్టర్స్ కూడా అద్దాలు పగిలిపోవడం అంటే దాని తీవ్రరూపం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం అధికారులు, అడ్మినస్ట్రేషన్ వైఫల్యమే. ఇది 10,15 ఏళ్లనుంచి వినిపిస్తోన్న సమస్య. మృతులంతా కూడా ఝార్ఖండ్, ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులే. సచివాలయంలో కూర్చొని ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో ఎవరికీ అంతుపట్టకుండా ఉంది.
2. ప్రమాద స్థిలిలో గొయ్యి. వాటి తీవ్రత, డెడ్ బాడీస్ ఇవన్నీ విజువల్స్ ద్వారాగానీ.. స్వయంగా గానీ.. చూసిన మీకు ఏమనిపిస్తుంది..?
ఇది ముమ్మాటికీ ప్రభుత్వం స్పాన్సర్డ్ నిర్లక్ష్యంతో కూడిన టెర్రరిజమేమో అనిపిస్తోంది. ఇదే బ్లాస్ట్ టెర్రరిస్టులు చేస్తే దేశం మొత్తం ఎలర్ట్ అయ్యేది.
3. ఈ ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత అంటారా..?
ఇంకా అక్కడ వేడిగాలులు.. వస్తున్నాయి. ఆ ప్రాంతమంతా కాలుతూనే ఉంది. చుట్టుప్రక్కల అందరికీ అభద్రతా భావం వచ్చేసింది. ఇది ముమ్మాటికీ వందశాతం ఫెయిల్యూర్.. నెగ్లిజెన్స్ ఆప్ టీడీపీ అన్నారు.
4. ఇంత పెద్ద స్థాయిలో మందుగొండు సామాగ్రి ఉండి.. పక్కనే గుడిసెల్లో కార్మికులు నివసించడం దీనిపై మీరు ఏమనుకుంటున్నారు.?
ఆంధ్రప్రదేశ్ అంతటా ఇది ప్రధాన సమస్యగా ఉంది. నాయకులు వారి స్వలాభం కోసం వాడకూడని బ్లాస్టింగ్ మెటీరియల్ వాడుతున్నారు. ఇదొక్కటే కాదు ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి ఆంధ్రాలో..అయితే ఈ దోపిడి.. అంటే దందా ప్రభుత్వం.. టీడీపీ నాయకులు అంతా వాటాదారులుగానే ఉన్నట్లు అనిపిస్తోంది.
5. ఇంతటి ప్రమాద బాధితులకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు.?
ఇలాంటి ఘటనలతో ముందు ముందు భారీ పాలసీ తీసుకురాబోతున్నాం. ఈ ఓనర్స్ పై గూండా యాక్ట్స్ పెట్టాలి అని ఆలోచిస్తున్నాం. రెండు వారాల్లో సీఎం దీనిపై చర్యలు తీసుకోకపోతే మేం పోరాడతాం. అదేవిధంగా ఇది 100 శాతం ప్రభుత్వం వైఫల్యమే అన్నారు పవన్ కల్యాణ్. భవిష్యత్తులో మంచి చట్టం తెచ్చేందుకు గట్టిగా పోరాడతాను అన్నారు జనసేనాని.