ఇండోనేసియాలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 83 సంవత్సరాల వ్యక్తి ఒక అభంశుభం తెలియని బాలికని సెక్స్ బానిసగా మార్చుకున్నాడు. ఒకరోజు రెండ్రోజులు కాదు ఏకంగా పదిహేనేళ్ళు. వింటుంటేనే అదోలా అనిపిస్తోన్న ఈ ఘటన ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. ఇండోనేషియాలో ఒక తెగకి సంబందించిన వ్యక్తి పదమూడేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి ఒక గుహలో బంధించాడు. మరణించిన ఆమె బాయ్ ఫ్రెండ్ ఆత్మ తనలో ఉందని ఆమెని నమ్మిస్తూ ఒక రోజు రెండ్రోజులు కాదు దాదాపు పదిహేనేళ్ళ పాటు ఆమె మీద అత్యాచారం చేస్తూ ఆమెనొక సెక్స్ బానిసని చేసేసాడు. ఇటీవలే కొందరు స్థానికులు అక్కడి గుహలోకి వెళ్ళగా వారికంట పడిందా అమ్మాయి. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెని పగలంతా ఆ గుహలోనే బందించే ఆ వ్యక్తి రాత్రయితే మాత్రం తనతో ఇంటికి తీసుకెళ్ళి అనుభవించేవాడని ఆ తర్వాత తెల్లవారక మునుపే ఆమెని తీసుకెళ్ళి మరలా ఆ గుహలో బందించేవాడు. "హెచ్" అని పేరుతో పిలువబడుతున్న బాదితురాలు 13 ఏళ్ల వయస్సులో కిడ్నాప్ అయ్యింది. దీంతో ఇప్పుడా ముసలి వ్యక్తి మీద లైంగిక వేధింపులు, బాలల హక్కుల కేసులు నమోదయ్యాయి. ఒక వేల ఆ వ్యక్తి గనుక నేరం ఒప్పుకుని పశ్చాత్తాప పడితే పదిహేనేళ్ళు కటిన కారాగార శిక్ష విధించే అవకాసం ఉంది. ఆ చిత్రాల్లో ఆమె కోసం గుహలో అమరిపోయేలా చేసిన చెక్క వస్తువులని గమనించవచ్చు.