విడదల రజనీ, ఈ పేరు మిగతా జిల్లాల వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు గానీ చిలకలూరిపేట వాసులకి సుపరిచితం. రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో తొలుత టీడీపీకి దగ్గరవ్వాలని భావించిన ఈ ఎన్నారైమహిళా అందుకు తాను స్థాపించి సమాజ సేవ చేస్తున్న వీఆర్(విడదల రజనీ) ట్రస్ట్ ను అందుకు అనుగుణంగా వాడుకున్నారు. చివరికి చిలకలూరిపేట ప్రస్తుత శాసనసభ్యుడు ఏపీ మంత్రి పుల్లారావు దృష్టిలో పడ్డారు. ఆయన చొరవతో సీఎం ఆసీనులై ఉన్నసభలో ప్రసంగించి జగన్ ను తిట్టి చంద్రబాబు దృష్టిలో కూడా పడ్డారు.
ఆయా తర్వాత ఏకంగా పుల్లారావు సీట్ అడిగి అధిష్టానంతో లేదనిపించుకున్నారు. అక్కడితో ఆగక ఢిల్లీ సాథయిలో లాబీయింగ్ లు చేయడం వలన ఆమెకు ప్రత్తిపాటి పుల్లారావుతో ఏర్పడిన విబేధాలు ఆమె టీడీపీని వీడి వెళ్లేంత వరకు తీసుకు వెళ్లాయి. ఆమె అక్కడితో ఆగకుండా పుల్లారావుని ఓడించి తీరుతానంటూ శపథం చేయడం అప్పట్లో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఆ తరువాత సైలెంట్ అయినా ఆమె బీసీ సంఘాన్ని బలపరుచుకునే పనిలో పడింది. అయితే ఈ నేపథ్యంలో ఆమె తాజాగా వైసీపీలో చేరడంతో మరో చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే చిలకలూరిపేట నుండి వైసీపీ తరపున సీనియర్ నేత మర్రి రాజశేఖర్ బరిలో ఉంటారు. ఆయన్ని కాదని ఈమెకు టికెట్ ఇస్తారా ? టికెట్ ఇవ్వకుంటే టికెట్ కోసమే టీడీపీని వీడిన ఆమెకు ఉపయోగం ఏముంటుంది అనే చర్చ మొదలయ్యింది.
ఒకరకంగా మర్రిరాజశేఖర్ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు, ఈనేపథ్యంలో ఆర్ధికంగా బాగా బలమైన రజనీకి జగన్ టికెట్ ఇస్తే మర్రి రాజశేఖర్ పరిస్థితి ఏమిటనేది ప్రశ్నర్ధకం ? పుల్లారావుకు గట్టి పోటీ ఇవ్వగలిగే రాజశేఖర్ మాత్రం తనకు అవకాశం దక్కకపోతే ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం సీటే ప్రధాన టార్గెట్ గా ముందుకు వెళుతున్న జగన్ ఇప్పుడు మర్రి లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టి ఆర్ధిక దన్ను కోసం చూడటం అక్కడ టీడీపీకి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. అయితే రజనీ వెంట పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఈ అంశం టీడీపీలో కూడా చిచ్చు రేపుతోంది. రజనికి టికెట్ వస్తుందా లేదా పుల్లారావును ఓడిస్తే చాలని మర్రి వెనుక నిలబడుతుందా అనేది వేచి. చూడాల్సి ఉంది.