తెలంగాణా ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్ గవర్నర్‌తో సమావేశమయ్యారు. అయితే గవర్నర్‌తో కేసీఆర్ భేటీ వింతేమీ కాకపోయినా రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు ఊహాగానాల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఢిల్లీ పర్యటనకు ముందు గవర్నర్ ను కలిశారు కేసీఆర్. మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి చర్చలు జరిపిన విషయం విదితమే. అయితే కేసీఆర్ ఢిల్లీ నుండి బయలుదేరుతూనే కేబినెట్ భేటీకి మంత్రులను సమాయత్తపరచడం, ఆ భేటీ పూర్తయిన వెంటనే నేరుగా గవర్నర్‌ను కలవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ముందస్తు ఎన్నికల విషయంలో కేంద్రంతో చర్చించాక ఆ విషయాలు గవర్నర్ కు చేరేవేసేందుకే ఆయన భేటీ అయ్యారని తెలుస్తోంది.