తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ఒక పక్క శరవేగంగా సాగుతుంటే.. మరోపక్క ఆ సభపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ న్యాయవాది హైకోర్ట్ కెక్కాడు. కొంగరకలాన్ వేదికగా నాలుగు సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపేలా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ నిర్వహిస్తున్నారు. అర కిలోమీటర్ దూరంలో ఉన్నవారు కూడా సభను తిలకించేందుకు వీలుగా 50 భారీ ఎల్ఈడీ తెరలతో కేసీఆర్ బొమ్మ కట్టి చూయించబోతున్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం పనులు కూడా చకచకా పూర్తి చేసేస్తున్నారు. దీంతో ముఖ్యంగా హైదరాబాద్ అంతా గులాబీమయం కానుంది. హెలీప్యాడ్ తో పాటు మొబైల్ ఫోన్ సిగ్నల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలక్రిష్ణ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా భారీ విందులు కలిగించనున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ హిస్టరీని గుర్తు చేసుకొనేలా ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వేదిక వద్దకు 15 రోడ్లతో మిక్స్ చేసి అనుసంధానించనున్నారు. అలాగే వేదిక ప్రాంతంలో మల్లారెడ్డి వైద్య కళాశాల, నారాయణ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఏడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 30 అంబులెన్సులను సిద్ధం చేయనున్నారు. అత్యవసర చికిత్సకోసం 100 మంది వైద్యులు, 150 మంది నర్సులతో పాటు పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఏర్పాటు చేయనున్నారు.
అయితే ఇంత పకడ్బంధీగా నిర్వహించతలపెట్టిన వేడుక వంటి ఈ కార్యక్రమానికి పర్యవరణం పరంగా అడ్డకట్ట వేసేందుకు హైకోర్టులో పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 2న కొంగరకలాన్ లో నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ జరపకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటిషన్ వేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారించనుంది. ఎంతైనా ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా, సాంఘిక మాద్యమాల ద్వారా చేయాలని.. ప్రజలకు, పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. మొత్తానికి కేసీఆర్ నిర్వహిస్తోన్న ఈ సభ కాంగ్రెస్ పార్టీకి కూడా చమటలు పట్టేలా చేస్తుంది. వెంటనే కాంగ్రెస్ నేతలంతా కలిసి కేసీఆర్ సభకు ధీటుగా తెలంగాణలో ప్రజా ఆవేదన సభ నిర్వహించాలని భావించేలా చైతన్యం తెచ్చింది. ఏది ఏమైనప్పటికీ ముందస్తులో భాగంగా కేసీఆర్ నిర్ణయాలు, ఆలోచనలు ఎన్నికల కోణాన్ని ఆవిష్కరించేలా జరుగనున్నట్లే తెలుస్తోంది. చూద్దాం ప్రగతి నివేదిన సభ సాపీగా సాగాలని కోరుకుందాం.
సూర్యోదయము: 5:46 am | |
సూర్యాస్తమయము: 6:38 pm | |
వారం: మంగళవారం | |
తిథి: అష్టమి 20:42 | |
నక్షత్రం: శ్రవణ 07:38 | |
యోగం: శుక్ల 13:50 | |
రాహుకాలం: 3:23 pm - 4:59 pm | |
యమగండం: 9:01 am - 10:37 am | |
వర్జ్యం: 12:04 pm - 1:50 pm | |