టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. ముందునుంచీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తొలి ప్రాధాన్యత అని పేర్కొన్న కేసీఆర్ తన విషయంలో మాత్రం ఎందుకు అన్యాయం చేశారని చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూర్ టికెట్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంపై అధిష్టానంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆదేదనకు లోనై.. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే మనస్థాపంతో.. గృహనిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇంట్లో తాళం వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఓదెలుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా గృహనిర్బంధంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాల్క సుమన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
1. మీకు టిక్కెట్ రాకపోవడానికి ఎవరు కారణం అని భావిస్తున్నారు.?
నిరంతరం కేసీఆర్ వెంట.. హైదరాబాద్ లో ఉంటూ దొంగ లెక్కలు.. దొంగ మాటలు.. దొంగ సర్వేలకు సపోర్టు ఇస్తున్న బాల్క సుమన్ నాకు టికెట్ రాకపోవడానికి బాధ్యు అని స్పష్టం చేశారు నల్లాల ఓదేలు. నిత్యం అధికారులతో ఉంటూ.. హైదరాబాద్ లో ఉంటూ.. ఎంపీగా ఉండి కూడా ఈ నియోజక వర్గానికి రానీ బాల్క సుమన్ నాపై చాడీలు చెప్పి టికెట్ తనకు రాకుండా ఆయనకు తెచ్చుకున్నాడని ఆయన తెలిపారు.
2. ఎన్ని రోజులుగా ఈ కుట్ర జరుగుతోంది.?
ఇది చాలా కాలంగా జరుగుతోంది. అందులో భాగంగానే ఆయన కేసీఆర్ కుటుంబానికి దగ్గరై అన్నీ చేస్తున్నాడు. నాకు ఈ మధ్యనే ఈ విషయం తెలిసిందే. సరే నిదానంగా చెప్దామనుకున్నాను. కానీ.. ఆలోపే కేసీఆర్ నా దేవుడు టిక్కెట్లు ప్రకటించేశారు అన్నాడు.
3. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు..?
గతంలో నేను 3సార్లు గెలిచాను. కేసీఆర్ నాకు దేవుడే కానీ.. ఇది కేవలం బాల్క సుమన్ చేసిన కుట్ర మాత్రమే. ఇప్పటికైనా.. కేసీఆర్ స్వయంగా మరో సర్వే చేయించి తమకు చెన్నూరు సీటు ఇవ్వాలని కోరుతున్నా. నాకు సీటు రాకపోతే నేను చన్నిపోయినట్టే. నేను ఇలా స్వీయ గృహ నిర్భందానికి బాల్క సుమన్ చేస్తున్న కుట్రే కారణం. ఆయన కుట్రకు నిరసనగా అందరికీ తెలియాలని.. నియోజక వర్గ ప్రజలకు మొఖం చూయించలేక ఇలా నిరసన తెలుపుతున్నా..
4. ఈ బాల్క సుమన్ కుట్రను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారా..?
నేను కేసీఆర్ బంటుగా.. కేసీఆర్ బంధువుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాను. నేను ఇంకా కేసీఆర్ ని కలవలేదు. ఇప్పుడు కవితను, కేటీఆర్ ను, హరీష్ రావును కలిశాను. వీళ్లందరూ కూడా నాకు సర్వే తక్కువ వచ్చింది అని చెప్పారు. కానీ.. ఇన్ని సార్లు బంపర్ మెజారిటీతో గెలిచిన తనకు సర్వే ఎలా తక్కువ వస్తది. ఇది అదేం కాదు. బాల్క సుమన్ చేసిన కుట్రేలో భాగమే ఇదంతా అని నా ఆవేదన. ఏం లేదు.. బాల్క సుమన్ ఇక్కడ నుంచి గెలిచి ఈ జిల్లాలో ఎవరూ లేరని.. మంత్రి అవుదామని చూసి ఆయన చేసిన కుట్ర ఇది. ఒక ఉద్యమకారునిగా నేను టిక్కెట్టు కోసం ఆఖరిక్షణం వరకు పోరాడతా. ఆయన మనస్సు మారి మరొక్క సర్వే చేపించి నాకు సీటు ఇవ్వాలని కోరుకుంటున్నా.
5. సీటు ఇవ్వకపోతే ఏం చేస్తారు..?
ఏం చేయను. నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏం చేయను. నేను బాల్క సుమన్ పై కుట్రలో భాగంగానే ఉద్యమిస్తాను. నా ఆలోచన అంతా ఒక్కటే. ఉద్యమకారులపై సుమన్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తున్నాడు. ఆయన అరాచకాలను ఆపాలన్నదే నా పోరాటం. నాకు నిజంగా కేసీఆర్ పై ఆశ ఉంది. ఆనాడు కేసీఆర్ కోసం రాజీనామా చేశాను. ఈనాడు కేసీఆర్ కోసమే ఉన్నాను.
6. కేసీఆర్ ఈసారికి మీరు ఊరుకోండి అంటే ఊరుకుంటారా..?
స్థానికత అన్నీ చూసుకోవాలి కాబట్టి.. నేను కేసీఆర్ ను కలిసి ఆయను అన్ని విషయాలు వివరిస్తాను. నాకు సర్వేలో కూడా 43 శాతం వస్తే.. బాస్క సుమన్ కు 4 శాతం వచ్చింది. కేసీఆర్ టిక్కెట్ ఆయనకు ఇవ్వడు. ఇక కేసీఆర్ టిక్కెట్టు ఎక్కడిస్తాడు. గెలిచేది ఎక్కడిది అన్నారు నల్లాల ఓదేలు. నాకే కేసీఆర్ టిక్కెట్ ఇస్తారు. గెలిచేది నేనే అంటూ తెలిపారు నల్లాల ఓదేలు.