ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిటాల కుటుంబం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పరిటాల శ్రీరాములయ్య మొదలుకుని పరిటాల హరీంద్ర, రవీంద్ర ఇలా వారి ప్రస్థానం సాగింది. అయితే రవీంద్ర మంత్రమే రాజకీయాల్లో అడుగుపెట్టి అనతికాలంలోనే రాష్ట్ర నాయకుడి స్థాయికి ఎదిగారు. ఆ తరువాత కొన్ని వ్యక్తిగత కక్షల రీత్యా ఆయన హత్య చేయబడ్డారు. రవి హత్య తర్వాత అనూహ్యంగా తమ వారి కోసం సునీత ముందుకు వచ్చి రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన పరిస్థితుల్లో పరిటాల సునీత మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటె ఆమె తనయుడు శ్రీరామ్ సొంత జిల్లాలో క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకమవుతూ ముందుకు వెళుతున్నారు. పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో రాజకీయంగా ఎదుగుతున్న శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో లోకేష్ తర్వాత యువ ప్రతినిధిగా నిలబడ్డాడు. అయితే తానూ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతారు అని అటు పరిటాల అభిమానులు , తెలుగుదేశం పార్టీ కేడర్,అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. శ్రీరామ్ పెనుగొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారు అని ఊహించారు కానీ చరిష్మా వున్న యువ నేతను ఒక్క నియోజకవర్గానికే పరిమితం చెయ్యకుండా హిందూపూర్ పార్లమెంట్ నుండి ఎన్నికల బరిలో నిలిపే యోచనలో వున్నట్టు తెలుస్తుంది.పరిటాల శ్రీ రామ్ ను హిందూపూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దింపితే పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలని శ్రీరామ్ ప్రభావితం చేయగలడన్న సర్వే రిపోర్ట్ అధిష్టానం వద్ద ఉన్నదని పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఇక వచ్చే ఎన్నికల్లో హిందూపూర్ ఎంపీగా ఆయన పోటీ చేయడం అనేది లాంచానమనే చెప్పాలి.