వరంగల్ జిల్లాలో కొండా దంపతుల ప్రభావం ఏమాత్రం ఉండబోదని చెప్పారు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి. వరంగల్ తూర్పులో ఆదరణ లేకపోవడం కారణంగానే వారు పరకాల దారి పట్టారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులతో కేటీఆర్ దృష్టి సారించారని.. అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పారు కడియం శ్రీహరి. ఈరోజు ఆయనతో జరిపిన ముఖాముఖిలో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. వారేమన్నారో చూద్దాం.
1. స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్యను మార్చబోతున్నారన్న వాదన వినిపిస్తుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి.?
పార్టీ 105మంది అభ్యర్థులను ప్రకటించారు. వీరిని ఏమాత్రం మార్చమని పార్టీ పలుమార్లు వెల్లడించారు. దాంతో పార్టీ ఎవరిని ఎన్నిక చేస్తే వారిని గెలిపించేందుకు పార్టీకోసం పాడుపడతాం. అందులో ఏమాత్రం సందేహం లేదని శ్రీహరి తెలిపారు.
2. స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గం కార్యకర్తలను కేటీఆర్ హైదరాబాద్ రమ్మన్నారని తెలిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి.?
అక్కడ ఆ నియోజక వర్గం కార్యకర్తల అభిప్రాయం తెలుసుకొనేందుకు కేటీఆర్ పిలిచారు. వారు తెలుసుకుంటారు. స్థానిక పరిస్థితులను వివరించే అవకాశం అక్కడ ఉంటుంది.
3. అసంతృప్తుల ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎంతమేరకు చూపుతుంది.?
కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు బలమైన నమ్మకం, విశ్వాసం కనిపిస్తుంది. గత నాలుగేళ్లుగా కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు వంటివి బాగా ప్రజల్లో ప్రభావం చూపుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంట్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆసా ఫెంక్షన్లు, గురుకుల పాఠశాలల అన్నీ కూడా కేసీఆర్ పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడింది. వీటన్నింటితో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని.. అప్పుడే భారతదేశంలో తెలంగాణ ఓ వెలుగు వెలుగుతదని అనే నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు.
4. రెబల్ అభ్యర్థులు బరిలో దిగే అవకాశం ఉంది.. ఎక్కడెక్కడని మీకు అంచనాలు ఉన్నాయా..?
అక్కడక్కడ ఉంటారు. నోటిఫికేషన్స్ వచ్చాక, విత్ డ్రాల్స్ అయ్యాక గానీ ఆ విషయం తెలియదు అని శ్రీహరి అన్నారు. ఇప్పటివరకు అంతా సద్దుమనిగిందనే నేను అనుకుంటున్నాను.
5. వరంగల్ తూర్పు ఎవరికి కేటాయిస్తున్నారు. కొండా దంపతులు ప్రభావం అక్కడ ఏమేరకు ఉండనుంది.?
కొండా దంపతుల ప్రభావం వరంగల్ రాజకీయాల మీద ఏమాత్రం ఉండబోదు. వాళ్లు టీఆర్ఎస్ నుంచి బైటకు వెళ్లి టీఆర్ఎస్ కు మేలు చేసినట్లుగానే భావించవచ్చు. కొండా దంపతులు వరంగల్ తూర్పు నుంచే పోటీ చేయాలి. అలా కాకుండా ఓటమి భయంతో పరకాలకు వెళ్లిపోతున్నారంటే వారి సామర్థ్యం ఏంటో అర్థమౌతుంది అన్నారు కడియం శ్రీహరి.