మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరీర్ ఏ మాత్రం బాగాలేదు. `తిక్క` నుంచి మొన్నటి `తేజ్ ఐలవ్ యు` వరకూ ప్లాప్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. డబుల్ హ్యాట్రిక్ ప్లాప్ లు అందుకుని తీవ్ర నిరూత్సాహంలో ఉన్నాడు. కొన్ని నెలలుగా చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నాడు. ఆ తప్పులు మళ్లీ రిపీట్ చేయనంటూ తాజాగా అభిమానులకు ప్రామిస్ చేసాడు . అక్టోబర్ 15 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. అదేంటో ఆయన మాటల్లోనే? గెలిచినప్పుడు వేలకు పైగా చేతులు చప్పట్లు కొడతాయి. ఓడిపోయినా..మీ చప్పట్ల చప్పుడు ఆగలేదు. జయపజయాలకు అతీతంగా నన్ను ప్రోత్సహిస్తు నా వెంట ఉన్నారు.
అందుకు ప్రతీ అభిమానికి కృతజ్ఞతలు. ఇటీవల కాలంలో నా సినిమాలేవి మీ అంచనాలు అందుకోలేకపోయాయి. అందుకు కారణాలు ఏంటని విశ్లేషిస్తున్నా. మీ సూచనలు, సలహాలతో వాటిని మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటా. నన్ను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నా. మీరు నాపై చూపించే ప్రేమాభిమానలు మరింత దృఢంగా ఉండేలా చేస్తున్నాయ`న్నారు. అలాగే పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సెలబ్రేషన్స్ చేయవద్దని..ఆ డబ్బును అనాధ బాలలకు ఖర్చు చేయండని సూచించాడు. ప్రస్తుతం తేజు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. కొత్త సినిమా మేకోవర్ లో బిజీగా ఉన్నట్లు కొన్ని రోజులు గా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.