మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అందుతున్న్ సమాచారం ప్రకారం ఈ ఎన్నికలు తెలంగాణలో ఒకే దశలో జరగనుండగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెండు దశల్లో జరుగుతాయట. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటివారంలో ఈసీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తుందని సమాచారం. తాజాగా జరిగిన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ప్రశాంతంగా ముగిసినందునే లోక్ సభ ఎన్నికలను కూడా ఒకే దశలో ముగించేందుకు ఈసీ ప్రణాళిక రూపొందించనుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో లోక్ సభ నియోజకవర్గాలు అధికంగా ఉండటం, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలను సైతం జరిపించాల్సి రావడంతో కారణంగానే రెండు దశల ఆలోచనను ఈసీ చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ఎన్నికల అధికారులకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు అందాయని తెలుస్తోంది.