`మీటూ` ఉద్యమం పూర్తిగా చల్లబడిపోయింది. అప్పుడప్పుడు గాయని చిన్మియి ఆరోఫణల తప్ప! ఇంకెక్కాడా ఆ వేడి కనిపించలేదు. మరి మీటూ వల్ల బాధితులకు న్యాయం జరిగిందా? అంటే లేదనే చెప్పాలి. కేవలం ఆరోపణలకే పరిమితమైంది తప్ప! దాని మీద సరైన చర్యలు తీసుకున్న దాఖలాలైతే కనిపించలేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ , పీకేలాంటి సినిమాచేసిన రాజ్ కుమార్ హిరాణీ పై లైంగిక ఆరోపణలు పోటెత్తాయి. ఆయన వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఓ మహిళ ఆరోపించింది. సంజు సినిమాకు పనిచేస్తున్నపుడు రాజ్ కుమార్ రోజు లైంగిక వేధించినట్లు ఆరోపణలలకు తెరలేపింది. ఈ విషయం గురించి సదరు మహిళ ‘సంజు’ సినిమా నిర్మాత విధు వినోద్ చోప్రాకు, అతని సోదరి, భార్యకు మెయిల్ పంపినట్లు హఫ్ పోస్ట్ ఇండియా పత్రిక పేర్కొంది.
నా పట్ల జరిగింది చెరుపుకోలేని తప్పు. రాజ్ కుమార్ పేరున్న దర్శకులు. నేను ఆయన అసిస్టెంట్ ను. నాకు జరిగిన అన్యాయంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను. కానీ ఆ రోజు నా మనసు, శరీరం మలినమైపోయాయి. నాటి నుంచి ఆరు నెలలపాటు అదే కొనసాగింది. ఎవరికీ చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం, ఇంకొచోట పని దొరుకుతుంతో? లేదని బాధతో అన్నింటిని దిగమింగుకుని బ్రతకుతున్నానని ఆ మెయిల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిని హిరాణీ తరుపు న్యాయ వాధి ఖండిచాడు. ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు. ఎవరో హిరాణీ పేరు చెడగొట్టడానికి ఇలా చేయిస్తున్నారని తెలిపాడు.