వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిళ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను అంజనీ కుమార్ ను కలిశారు. ఆమె కలవాలని అపాయింట్ మెంట్ కోరిన వెంటనే ఆయన వెంటనే అంగీకరించారు. దీంతో షర్మిళ భర్త అనిల్ కుమార్, వైకాపా నేతలు వైసీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులతో కలిసి ఆమె సీపీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె రాజకీయంగా తనను, తన అన్న వైఎస్ జగన్ ను, ఆయన కుటుంబాన్ని అణగ దొక్కాలని చూస్తున్న కొన్ని రాజకీయ శక్తులు సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై, తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయనకు అందించానని, ఆయన సానుకూలంగా స్పందించి, విచారణ జరిపిస్తానని మాటిచ్చారని అన్నారు. అయితే ఆమె ముందుగా సీపీ అపాయింట్మెంట్ కోరగానే జగన్ పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావును ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంచి ఎన్ఐఏ విచారిస్తున్న వేళ, ఆ ప్రక్రియ ఎంతవరకూ వచ్చిందన్న విషయాన్ని తెలుసుకునేందుకు షర్మిళ వెళుతున్నారని ప్రచారం జరిగింది. కానే అదేదీ కాదని ఇదంతా అసభ్య ప్రచారం చేస్తున్న వారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారని రూడీ అయినట్టే.