బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రాణాంతక స్వైన్ ఫ్లూ బారినపడ్డారు. అస్వస్థతకు గురైన ఆయన దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయనకు ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగుతున్నాయి. తాను స్వైన్ ఫ్లూ బారిన పడినట్టు అమిత్ షా నిన్న రాత్రి ట్విటర్ ద్వారా తెలియజేశారు ‘నాకు స్వైన్ ఫ్లూ వచ్చింది. దానికి సంబంధించిన చికిత్స కొనసాగుతోంది. ఈశ్వరుడి దయ, మీ అందరి ప్రేమ, అభిమానాలతో త్వరగా కోలుకుంటానని అమిత్ షా ట్వీట్ చేశారు. వాస్తవానికి కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో స్వైన్ ఫ్లూ కారక ఎన్1హెచ్1 వైరస్ విజృంభిస్తోంది. దీంతో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు తెలంగాణలోనూ స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటె బీజేపీ అగ్రనాయకులని, కేంద్ర మంత్రుల్ని ఆరోగ్యం భయపెడుతోంది. తాజాగా కేంద్ర మంత్రి ఒకరు మరణించగా మరో మంత్రి రవి శంకర్ ప్రసాద్ అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. మరో పక్క జైట్లీకి కూడా ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన అకస్మాత్తుగా అమెరికా వెళ్ళిపోయారు. అయితే గత ఎన్నికల్లో కంటే ఈసారి బాగా కష్టపడాల్సి రావడంతో బీజేపీ ఒకపక్క కష్టపడుతూ ఉంటె వారికి మాత్రం ఆరోగ్యాలు సహకరించడం లేదు.