విలక్షణ నటుడుగా పేరుతెచ్చుకొని సినీ రంగం నుంచి రాజకీయ నేతగా మారిన ప్రకాష్ రాజ్ అప్పుడే ప్రచారాన్ని మొదలెట్టేశారు. తాను కొత్త ప్రయాణం.. బాధ్యతాయుతంగా.. అర్థవంతంగా ఉంటుందని ప్రకటించారు. రాబోవు లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించిన ఆయన ఈరోజు నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించారు.
కాగా ఆటోలో తిరుగుతూ పలువురిని కలుస్తున్నారు. అయితే ఈ మధ్య ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏపార్టీలో గానీ.. సరికొత్త పార్టీగానీ... ఏర్పాటు చేయనని...స్వతంత్రంగా బరిలోకి దిగుతానని తెలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రస్తుతమున్న ఏ పార్టీలో కూడా నిజాయితీ లేదని.. దీంతో ఏ పార్టీలోనూ చేరబోనని తెలిపారు. త్వరలో మేనిఫెస్టోను రిలీజే చేస్తానని.. పర్యటిస్తున్న ప్రాంతాలను... కలిసిన వ్యక్తుల విజువల్స్ ను ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా ప్రకాశ్ రాజ్ తన ప్రచారానికి పింక్ కలర్ ను ఎంచుకోవడం విశేషం.
A new journey... a meaningful journey.. a responsible journey begins. #bengalurucentral #citizensvoice in parliament.. #2019 elections.. pic.twitter.com/6cYwX8Hgj2
— Prakash Raj (@prakashraaj) January 20, 2019