ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్‌కల్యాన్ ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించిన జనసేనాని.. ఇప్పుడు మరికొన్ని జిల్లాల నేతలతో అక్కడి పరిస్థితులపై సమీక్షలు నిర్వహించారు.
అయితే ఇప్పుడు ముఖ్యంగా ఉత్తరాంధ్రపై పవన్ దృష్టి పెట్టినట్టు సమాచారం అందుతుంది. ఈక్రమంలో భాగంగానే మరోసారి ఆయన విశాఖ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న పవన్ విశాఖ వెళ్తారు. 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా నాయకులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే.. అదే రోజు మధ్యాహ్నం పాడేరులో బహిరంగసభలో పాల్గొంటారు. 24వ తేదీన విజయనగరం జిల్లా నేతలతో.. 25వ తేదీన విశాఖపట్నం జిల్లా నేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.