మహానాయకుడు కి గుమ్మడికాయ కొట్టేసారు
February 10,2019 03:05 PM
ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా తెరకెక్కుతోన్న పార్ట్ -2 `మహానాయకుడు` షూటింగ్ నిన్నటితో పూర్తయింది. శనివారం ముఖ్యమైన నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించి షూటింగ్ పూర్తిచేసారు. దీంతో యూనిట్ గమ్మడికాయ కొట్టేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈసారి వేగవంతం కానున్నాయి. షూట్ పూర్తయింది కాబట్టి క్రిష్ ఆ పనులను దగ్గరుండి చకచకా పూర్తిచేయనున్నాడు. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ పై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. షూట్, రీ షూట్ బిజీలో పడి ఇన్ని రోజులు కేవలం సెట్స్ లోనే బిజీ అయ్యారు. ఆ పనులు పూర్తయ్యాయి కాబట్టి మంచి ముహూర్తం చూడటమే ఆలస్యం. ఇప్పటికే రెండు, మూడు సార్లు డేట్లు ప్రకటించి వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈసారి ప్రకటించే తేదీ ఓ క్లారిటీతో వచ్చే అవకాశం ఉంది. కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించని నేపథ్యంలో ఆశలన్నీ మహానాయకుడిపైనే ఉన్నాయి. ఎన్టీఆర్ పొలిటికల్ స్టోరీ కాబట్టి అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కథలో ఎలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్త పడినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. అలాగే పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రెండు పీఆర్ ఆటీమ్ లో చురుకుగా పనిచేస్తున్నాయట.