ఆకాష్ పూరి సినిమా ప్రారంభం
February 11,2019 06:35 PM
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా మూడవ సినిమా విషయంలో కొన్ని నెలలుగా సందిగ్ధత నెలకొంది. తనయుడు సినిమాకు మరోసారి తానే దర్శకుడవుతాడా? కొత్త దర్శకుడిని రంగంలోకి దింపుతాడా? బయట బ్యానర్లో చేస్తాడా? పూరినే నిర్మాత అవుతాడా? అన్న దానిపై మీమాంస కొనసాగుతోంది. తాజాగా వాటన్నింటికి తెరదించుతూ నేడు పూజా కార్యక్రమాలతో సైలెంట్ గా ప్రారంభించా షాక్ ఇచ్చాడు పూరి. `రొమాంటిక్` అనే టైటిల్ తో సినిమా తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి పూరి కథ, స్ర్కీన్ ప్లే, డైలాగులు అందిస్తుండగా, పూరి శిష్యుడు అనీల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు.
మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఆకాష్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేసాడు. ఆకాష్ న్యూ లుక్ కూడా విడుదల చేసారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామాన్నారు. ఆకాష్ తోలుత `ధోనీ` అనే సినిమాతో వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యాడు. అది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. అటుపై `మెహబూబా` ను తండ్రి స్వీయా దర్శకత్వంలో నిర్మించాడు. కానీ ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వేలేదు. దీంతో మూడవ సినిమాతోనై హిట్ కొట్టాలని కొన్ని నెలలు పాటు స్ర్కిప్ట్ పైనే వర్క్ చేసి, మెగా ఫోన్ బాధ్యతల్ని పూరి తన శిష్యుడికి అప్పగించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ హిట్ కొడతాడేమో చూద్దాం.