ఈ మధ్య సాయి పల్లవి పెళ్లి అంటూ తమిళ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే 'కణం' సినిమా డైరెక్టర్ ఏఎల్ విజయ్, సాయి పల్లవి ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. మరి ఈ ఊహాగానాలపై స్పందించిన విజయ్ అవన్నీ అవాస్తవాలని.. అలాంటిదేం లేదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా విజయ్ మాట్లాడుతూ... ప్రస్తుతం తాను జయలలిత బయోపిక్ 'తలైవి' పనుల్లో చాలా బిజీగా ఉన్నానని.. సాయి పల్లవితో ప్రేమాయణం అన్నది పుకార్ మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే విజయ్ గతంలో హీరోయిన్ అమలాపాల్ ను పెళ్లాడి ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.