సోషల్ మీడియా హవా నడుస్తోంది. ముఖ్యంగా ఎంతటి వారలైనా సోషల్ మీడియా ద్వారా వెలిగిపోతున్నారు. ఏ విషయాన్నైనా అంతేస్థాయిలో పంచుకుంటున్నారు. అసలు స్టార్స్ అయితే తమకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రతి నిత్యం అభిమానులతో పంచుకోవడం పరిపాటిగా మారింది.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న నటీనటులలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ టాప్ గేర్ లో ఉంది. అనతి కాలంలోనే అలియా భట్ అత్యంత ఘనకీర్తి సాధించింది. గల్లీ బాయ్ హిట్ తర్వాత కళాంక్ చేస్తున్న ఈ నటీమణి టాలీవుడ్ లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ లోకూడా నటిస్తోంది అలియా. కాగా అలియాకు ఇంస్టాగ్రామ్ లో 30 మిలియన్ ఫాలోవర్స్ తో టాప్ లో ఉంది అలియా భట్. దీంతో మొత్తానికి అలియా ఫాలోవర్స్ మామూలుగా లేరుగా అంటూ నెటిజన్లు మెచ్చేసుకుంటున్నారు.