టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రచారంలో దూసుకుపోతుంది. ఒక్కో స్టిల్ ను రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ సింగిల్ చోటి చోటి సాంగ్ ను మార్చి 29 వ తేదీన రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ సాంగ్ కు సంబంధించిన ఓ స్టిల్ ను ఈరోజు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
కాగా ఈరోజు ఆ సాంగ్ కు సంబంధించిన మరో ఫోటోను రిలీజ్ చేశారు. మహేష్ బాబు, అల్లరి నరేష్ లు చెరోవైపు ఉండగా మధ్యలో పూజా హెగ్డే ఉన్న ఫోటో ఉంది. ఈ ఫోటోను బట్టి సాంగ్ ను ముగ్గురిపై షూట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహర్షి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే.. వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 9వ తేదీన భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది.