‘భీమవరంలో పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తున్నా.. వివరాల కోసం వెయిట్ చేయండి’ అంటూ బుధవారం రాత్రి 1:41 నిమిషాలకు ట్వీట్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వోడ్కా ఎఫెక్టో ఏమిటో తెలియదు కాని.. ఏపీ ఎలక్షన్స్ నామినేషన్ల గడువు ముగిసిన తరువాత భీమవరం నుండి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తా అంటూ ఆసక్తికరమైన ట్వీట్ వదిలారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎట్టకేలకు మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లో వివాదాలను రాజేసిన రామ్ గోపాల్ వర్మ టీడీపీ నేతల పుణ్యమా అంటూ కావాల్సినంత ఫ్రీ ప్రమోషన్స్ సంపాదించి పెట్టుకున్నాడు. అయితే ఇది సరిపోదని అనుకున్నాడో ఏమో కాని.. ఎన్నికల వేళ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ‘భీమవరంలో పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తున్నా.. వివరాల కోసం వెయిట్ చేయండి’ అంటూ బుధవారం రాత్రి 1:41 నిమిషాలకు ట్వీట్ చేశారు.
ఒకవైపు నామినేషన్ల గుడువు అయిపోయింది.. ఎన్నికల డేట్ దగ్గర పడింది. ఈ టైంలా ఎలా పోటీ చేస్తాడా అని ఆలోచిస్తున్న తరుణంలో. ‘నామినేషన్ల గడువు పూర్తైందని నాకూ తెలుసు.. బట్ స్పెషల్ పర్మిషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తా’ అని ట్వీట్ చేశాడు వర్మ. ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటాయో, ఎన్నికల సమయంలో కమిషన్ ముందు ఎంత పెద్దవాళ్లైనా చిన్నవాళ్లే అనే సంగతి ఎంత మందికి తెలీదు చెప్పండి. అందికే వర్మ ట్వీట్లకు ఘాటు రిప్లైలు ఇచ్చారు. ‘రాత్రి తాగింది దిగలేదా వర్మ’ అంటూ ఏకిపారేశారు. కొన్ని వెబ్సైట్లలో కూడా వర్మను ఏకుతూ కథనాలు రాశారు. దీంతో ఇదొక ఏప్రిల్ ఫూల్ జోకని, అడ్వాన్స్‌గా వదిలానని మరో ట్వీట్ చేశారు. ఎవరూ ఈ వార్తను నమ్మి స్టుపిడ్ కాలేదు కదా అని ట్వీట్ చేశారు.