బద్రి, నాని, నరసింహుడు, పరమవీర చక్ర వంటి సినిమాల్లో నటించిన అమీషా పటేల్ ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గినట్లుగానే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మధ్య అమీషా పటేల్ వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. అప్పడప్పుడు సోషల్ మీడియాలో హాట్ బికినీలతో హల్ చల్ చేస్తున్న అమీషా ఆ మధ్య రాజకీయ పార్టీకి సోషల్ మీడియాలో ప్రచారం కల్పించేందుకు పలువురు బాలీవుడ్ తరాలు బేరం కుదుర్చుకుంటున్న వీడియోలో కూడా ఆమె కనిపించింది. ఆ వీడియో వివాదం మర్చిపోకముందే అమీషా పటేల్ మరోసారి వార్తల్లోకి వచ్చింది.
అదేమంటే తాను మెయిన్ రోల్ లో నటిస్తూ... దేశీ మ్యాజిక్ అనే సినిమాని నిర్మించింది. ఈ సినిమాకి కునాల్ గూమార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాని నిర్మించేందుకు అమీషా పటేల్, కునాల్ గూమార్కు ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అజయ్ కుమార్ సింగ్ 2.5 కోట్ల ఆర్ధిక సాయం చేశారు. కానీ సినిమా రిలీజే కాకపోవడం.. ఎంతకీ ఇద్దరూ కలిసి అప్పు చెల్లించక పోవడంతో అజయ్ కుమార్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశీ మ్యాజిక్ సినిమాని 2018లోనే రిలీజ్ చేస్తామని.. లాభాలు దండిగా వస్తాయని చెప్పారు. లాభాల్లో తనకు కూడా వాటా ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ సినిమా 2018లో విడుదల కాలేదు. దీంతో ఆ మధ్య అమీషా, కునాల్ ని అజయ్ కుమార్ కలవగా రూ. కోట్లకు చెక్ ఇచ్చారు. అయితే అదీ కూడా చెక్ బౌన్స్ అయింది. ఆ తర్వాత ఇదేంటని అడిగితే తాము డబ్బు చెల్లించే ఉద్దేశం లేదని...మీరు చేతనైంది చేసుకోమన్నారుని అజయ్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే.. వారిద్దరిపై తాను కోర్టులో కేసు వేశానని కూడా అజయ్ తెలిపారు.
అయితే తాను కేసు నమేదు చేసిన తర్వాత అమీషా, కునాల్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. అజయ్ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా అమీషా పటేల్ కొంతమంది ప్రముఖులతో దిగిన ఫోటోలు చూపిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని అజయ్ కుమార్ వివరించారు.