టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లయ్యాక కూడా ఓ వెలుగు వెలిగిపోతుంది. ఎంతో క్రేజీగా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు కాకుండా మంచి కథా బలమున్న సినిమాలు కూడా చేసుకుంటూ పోతుంది సమంత. మొదట్లో ఈ డెషిషన్ అంత ఉత్తమమైంది కాదని అంతా భావించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆమె చేస్తున్న సినిమాలు చూసి అయ్యారే అంటున్నారు. ఇప్పటికే 'యు టర్న్, రాజుగారి గది 2' వంటి విభిన్నమైన సినిమాలు చేసిన ఆమె కొత్తగా చేసిన సినిమా 'సూపర్ డీలక్స్'.
కాగా ఇందులో సామ్ పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. ఈరోజే ఈ సినిమా రిలీజైంది. సినిమాలో సమంత పెర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు, విమర్శకులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సమంత పాత్రలో గొప్ప నటన కనబరిచారని అంటున్నారు. ఇకపోతే సామ్ ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్లో 'ఓహ్ బేబీ' అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.