ఢిల్లీలో
దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా
ఎన్నికై.. తన నియోజకవర్గంలోని ప్రజలలు ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ..
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ మాజీ ఎమ్మెల్యే తప్పతాగి కోడలిపైనే అత్యాచారం
చేశాడు..! ప్రతిఘటించిన కోడలిపై గన్ ఎక్కుపెట్టి మరీ తన కోరిక
తీర్చుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని సంగ్లోయ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన మనోజ్ షోకీన్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది కోడలు.. పోయిన సంవత్సరం డిసెండర్ 31వ తేదీన అర్ధరాత్రి తనపై ఈ దారుణానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. అదే రోజు తాను పుట్టింటి నుంచి తమ ఇంటికి వచ్చానని.. నా భర్త స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిపోగా.. మద్యం సేవించిన మనోజ్ షోకీన్.. తన గదిలోకి వచ్చి బలవంతం చేశాడని.. నిరాకరించడంతో తుపాకీ తీసి, సోదరుణ్ని చంపుతానని బెదిరించి అత్యాచారం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. మరోవైపు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం దారుణమైన విషయమని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నాయి.