అల్లు
అరవింద్ కలల ప్రాజెక్ట్ రామాయణంపై రోజుకో న్యూస్ బయటకు వస్తోంది. దాదాపు
రూ. 1500 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారు. మూడు
పార్టులుగా మూవీ ఉంటుంది. 3డిలో చిత్రీకరిస్తారట. గత సంవత్సరం కాలంగా
స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నారు. ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అల్లు
అరవింద్ తో పాటు ప్రైమ్ మూవీస్ సంస్థలు కలిసి ఈ సినిమాను
నిర్మిస్తున్నాయి.
దంగల్ దర్శకుడు, మామ్
దర్శకులు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మూడు పార్టులుగా రిలీజ్
చేయాలని అనుకుంటున్న ఈ సినిమాలో రాముడు పాత్ర ఎవరు చేస్తున్నారు అన్నది
సస్పెన్స్ గా మారింది. దీనికోసం అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే,
ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ అయితే
రాముడి పాత్రకు సెట్ అవుతారని యూనిట్ అభిప్రాయం పడుతోంది. ప్రస్తుతం
హృతిక్ తో చర్చలు జరుపుతున్నారని హృతిక్ కూడా ఇందులో చేయడానికి సిద్ధంగా
ఉన్నాడని సమాచారం. 2021లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతున్నది.