అపరకుబేరుడుగా పేరు పొందిన అనీల్ అంబానీ రిలయన్స్ విషయంలో అప్పులు భాద తట్టుకోలేక చేతులెత్తేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ నుంచి తప్పుకున్నారు. డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్కామ్ కంపెనీని రక్షించలేక అనిల్ చేతులేత్తేశారు. ఆయనతో పాటు నలుగురు డైరెక్టర్లు కూడా కంపెనీకి రాజీనామా చేశారు. ఒకప్పుడు దేశంలోనే అపర కుబేరుడుగా ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆఖరికి అన్నకు ఇష్టమైన కంపెనీని ఆస్తి పంపకంలో దక్కించుకొని, దానిని కూడా నిలుపుకోలేకపోయారు. చివరికి కంపెనీని కాపాడుకోలేక రాజీనామా చేశారు. కేవలం అనిల్ అంబానీ మాత్రమే కాదు అతనితో పాటు మరో నలుగురు డైరెక్టర్లు కూడా ఈ కంపెనీకి రాజీనామా చేశారు. అనిల్ అంబానీతో పాటు ఛాయా విరాణి, రైనా కరానీ, మంజరి కకేర్, సురేష్ రంగాచారీలు డైరెక్టర్లుగా వైదొలిగారు.
గతంలో కంపెనీ డైరెక్టర్, సీఎఫ్ఓ వి.మణికంఠన్ రాజీనామా
చేశారని ఆర్కామ్ తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బీఎస్ఈకి ఇచ్చిన
నోటీసులో ఈ అంశాన్ని తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ
నష్టాలు రూ.30,142 కోట్లకు చేరిన విషయం అందరికి తెలిసిందే. మరి ఈ విషయంలో
అన్న ముకేశ్ అంబానీ అనీల్ కు సహాయం చేస్తారేమో చూడాలి. ఏది ఏమైనా బండ్లు
ఓడలు- ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో..