ప్రభుత్వంపై తెలుగుదేశం నేత బుద్ద వెంకన్న మరో సారి ఫైర్ అయ్యారు. ఆరునెలల పాలనలో ఎం చేసారని మీ కార్యకర్తలే అడుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగాబుద్ద విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలోనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. "విజయసాయిరెడ్డి గారిని చూస్తే ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరింది అనే పాత సామెత గుర్తొస్తోంది. రాష్ట్రంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించలేని మీరు, తెలంగాణ లో జరిగిన ఘటన గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది. రేప్ కేసు, వర కట్న కేసులో ఉన్న వ్యక్తులకు సీట్లు ఇచ్చిన పార్టీ మీది.70 శాతం నేర చరిత్ర ఉన్న వ్యక్తులను మన పార్టీలో పెట్టుకుని లెక్చర్లు ఇవ్వడం సిగ్గుగా లేదా? 6నెలల మీ పాలనలో రాష్ట్రంలో 20 మంది మహిళల పై అత్యాచార, వేధింపుల ఘటనలు జరిగాయి. జగన్ గారు అధికారంలోకి రాగానే వైకాపా కార్యకర్తలు ఒంగోలు లో మైనర్ బాలిక పై చేసిన అత్యాచార ఘటన మర్చిపోయారా..? బ్లూ మీడియాని అడ్డం పెట్టుకొని అత్యాచార ఘటనలు బయటకు రాకుండా మీరు, జగన్ రెడ్డి మ్యానేజ్ చేసినంత మాత్రానా నిజాలు దాగవు. రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అకృత్యాలు, వాటి వెనుక ఉన్న వైకాపా నాయకుల పేర్లు ఎప్పటికప్పుడూ బయట పెడుతూనే ఉంటా విజయసాయి రెడ్డి గారు " అని బుద్ధ వెంకన్న అన్నారు.
ఇక మరో పోస్ట్ లో "అన్నయ్యా వెతకండి అని అధికారుల కాళ్లు పట్టుకున్నాడు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ఏడ్చాడు. సెంటు భూమి కూడా కొన్నట్టు ఆధారాలు చూపించలేక, తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పెద్దగా ఇంటి నుండి బయటకు రావడం లేదు వంకర రెడ్డి.చినబాబు అవినీతి అని అల్లరి చేసి, ఒక్కరూపాయి అవినీతి జరిగినట్టు చూపించలేక చిల్లర గాడిలా మిగిలాడు వంకర రెడ్డి.మరో సారి వంకర రెడ్డి గుడ్డలు ఊడదీసి రోడ్డు పై నిలబెట్టాలని విజయసాయిరెడ్డి గారు కుట్ర పన్నారు.యాప్ తయారు చెయ్యడానికి చినబాబు సింగపూర్ ప్రభుత్వానికి 58కోట్లు సమర్పించాడు అని విచారణ ప్రారంభించాం అని మరో కట్టు కధతో వంకర రెడ్డి పరువు తీసేందుకు సిద్ధం అయ్యాడు. ఆరు నెలలు అయ్యింది ఏం గడ్డి పీకుతున్నారు అని మీ సొంత కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు అంటగా సాయి రెడ్డి గారు. వంకర రెడ్డిని మళ్లీ జైలుకి పంపే వరకూ అవినీతిని వెతుకుతూ ఉండండి అల్ ది బెస్ట్." అని బుద్ద వెంకన్న ట్విట్టర్ లో రాసుకొచ్చారు.