పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమైనందుకు అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అయితే పవన్ సినిమాలకు దూరమైన అయన పేరో అయన పాటో కనీసం అయన ఫోటో ఎదో ఒకటి సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది ఆయన పాటలను రీమేడ్ చేస్తున్నారు. అయితే పవన్ అభిమానులల్లో ఉత్సహాన్ని నింపే ఓ వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రంలో కిక్ బాక్సర్ గా కనిపించనున్నాడన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా పవర్ స్టార్ నటించిన జానీ సినిమా కు రీమేక్ అని టాక్ వినిపిస్తుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రినైసాన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
జానీ తరహాలోనే వరుణ్ సినిమా కూడా ఫుల్ ఎమోషనల్ గా ఉంటుందట. అయితే పవన్ స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో చిన్నపాటి తప్పులు చేసి సినిమా ఫ్లాప్ చేసుకున్నారని ,లేకుంటే జానీ సినిమా సూపర్ హిట్ అయ్యుండేదని మాట్లాడుకున్నారు. ఇప్పుడు అలాంటి తప్పులేవీ లేకుండా అదే లైన్ తో బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ సినిమాని రూపొందిస్తున్నారన్న ముచ్చటా సాగుతోంది. జానీ రీమేక్ గా ఈ సినిమా ఉండొచ్చన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక ఈ సినిమాలో వరుణ్ కు తల్లిగా రమ్యకృష్ణ నటించనున్నారని , తండ్రి పాత్రలో మాధవన్ కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనే విషయం తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.