తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్. ఈ మాట ప్రతిపక్ష నేతలు సైతం అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. 2001లో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆ పార్టీని ఏర్పాటు చేశారు. ఐతే ఆయన అనుకున్నట్టుగానే తెలంగాణ సాధించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీని రాజకీయ శక్తిగా మలిచారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఎదిగారు. తనదైన ముద్రతో తెలంగాణను అభివృద్ధి బాటలో నడుపుతున్నాడు. ఐతే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన టీఆర్ఎస్కు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా 4 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. దీంతో టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా పాతుకుపోయింది. ఐతే ఇప్పుడు కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా పోటీచేయాలని అనుకుంటున్నారట. అందుకే కరీంనగర్‌పై కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించారట. అందుకే నెల రోజుల వ్యవధిలోనే కరీంనగర్ పర్యటన చేశారని పార్టీ నేతులు అనుకుంటున్నారు. తనయుడికి సీఎం సీటు అప్పగించి... ఢిల్లీకి పోదామని కేసీఆర్ అనుకుంటున్నారట. అందుకే కరీంనగర్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువగా ఫోకస్ పెట్టారట. ఐతే అక్కడ బీజేపీ తరఫున బండి సంజయ్ గెలిచాడు. టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న కరీంనగర్లో ఎలాగైనా పూర్వవైభవం తేవాలని స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగనున్నారట. దీనిపై క్లారిటీ రావాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకూ ఆగాల్సిందే.