దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువులు, ముస్లింలు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే ముస్లింలపై మూకదాడులు కూడా విపరీతంగా జరిగాయి. ముఖ్యంగా గాంధీజీని చంపిన నాథురాం గాడ్సేను దేశ భక్తుడని భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారందరూ దేశ ద్రోహులని అభివర్ణించారు. దీంతో ప్రగ్యాసింగ్పై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. ఐతే ఇప్పుడు బీజేపీని ముందుండి నడిపించే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మగాంధీ కరుడుగట్టిన హిందువని ఆయన తెలిపారు. తనకు తాను హిందువుగా చెప్పుకునేందుకు గాంధీజీ ఎన్నడూ సిగ్గుపడలేదని వెల్లడించారు. గోపాలకృష్ణ గోఖలే పిలుపుతో దేశాటనం చేసి 'భారతీయత'ను నరనరాన పుణికిపుచ్చుకున్న గొప్ప వ్యక్తి గాంధీజీ అని తెలిపారు. బలమైన హిందువుగా ఉంటూనే ఇతర మతాలను సైతం గాంధీజీ గౌరవించాడని పేర్కొన్నారు. మోహన్ భాగవత్ వ్యాఖ్యలతో రాజకీయం వెడేక్కింది. బీజేపీ వైఖరిని ఆర్ఎస్ఎస్ ద్వారా తీసుకువస్తున్నది విపక్షాలు మండిపడుతున్నాయి.