బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. అప్పటినుండి ప్రభాస్ తీసే ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్నాయి. బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ఈ సినిమాకు ఫస్ట్ డే నే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఓవరాల్గా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ‘సాహో’ తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూర్తి లవ్ ఎంటర్టేనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
అయితే ప్రభాస్ ఈ సినిమా తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో కాదు ప్యాన్ వరల్డ్ రేంజ్లో ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఈ సినిమా కోసం ప్రభాస్.. ఏకంగా 100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడని అలాగే ఒక ఏడాదిలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పినట్టు టాలీవుడ్ లో ఓ పుకారు చెక్కర్లు కొడుతుంది. అయితే ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్లో సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.