ప్రస్తుతం తెలుగులో సరియన్ హిట్ సినిమా లేక వెనుకపడిపోయిన హీరోయిన్స్ లో లావణ్య త్రిపాఠి ఒకరు. నాచురల్ స్టార్ నాని తో భలే భలే మగాడివోయ్ తో సూపర్ హిట్ అందుకున్న తరువాత కూడా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఈ మధ్యే నిఖిల్ సరసన 'అర్జున్ సురవరం' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ భామకు నేరుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చిందట. రాజకీయాల కారణంగా రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా పింక్ సినిమాకు రీమేక్ అని అందరికి తెలుసు. అయితే ఈ సినిమాలో అంజలి అలాగే నివేదాథామస్ లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిలుగా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ లో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. అయితే అందులో ఒకరు శృతి హాసన్ అని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రెండో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి అని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ప్రస్తుతం లావణ్య ప్రస్తుతం తెలుగులో `ఏ1 ఎక్స్ ప్రెస్` సినిమాలో సందీప్ కిషన్ కు జంటగా నటిస్తోంది. ఈ సినిమాలో ఓ హాకీ ప్లేయర్ గా కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ. అయితే చూడాలి మరి ఏం జరుగుతుందో.