బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాక్షసుడు సినిమా హిట్ కావడం తో ఈ సినిమా పై అందరికి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో బెల్లంకొండ తో ఇస్మార్ట్ బ్యూటీ నభ నటేష్ జత కట్టనుంది. అయితే మరో ఇస్మార్ట్ బ్యూటీ అయిన నిధి అగర్వాల్ ఆ సినిమాలో ఓ 'ఐటెం సాంగ్'లో కనిపించనున్నది అని సమాచారం. అయితే తెలుగులో సవ్యసాచి సినిమాతో పరిచయం అయిన నిధి ఆ తరువాత మిస్టర్ మజ్ను సినిమాలో కనిపించింది. అయితే ఈ రెండు సినిమాలు ప్లాప్ కావడం తో మళ్ళీ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే గత సంవత్సరం రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ అందుకున్న నిధి అందులో ''దిమాక్ ఖరాబ్'' సాంగ్ లో తన అందాలను ఆరబోసింది. అయితే ఇప్పుడు అల్లుడు అదుర్స్ లో ఐటమ్ సాంగ్ కోసం నిధి ని సంప్రదించగా దానికోసం ఏకంగా 60 లక్షలు డిమాండ్ చేసిందట..! దాంతో షాక్ అయిన నిర్మాతలు ఇంకో హీరోయిన్ కోసం గాలిస్తున్నారట. అయితే చూడాలి మరి ఎవరు చేస్తారో ఆ సాంగ్ అనేది.