ప్రకాశం జిల్లాలో పెద్దపులి మృతి చెందింది. ముసలితనం వల్ల చనిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం చెన్నుపల్లి చెంచు గూడెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుతుంది. నల్లమల అడవి ప్రాంతంలో పెద్ద పులి మృతి చెందినట్టు గుర్తించారు. ఈ విషయం స్థానికులు అధికారులకు తెలియజేశారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు అక్కడ పరిశీలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం వెటర్నరీ డాక్టర్ ఆ పులికి పంచనామా నిర్వహించారు. ఈ పెద్దపులి వయసు 20 సంవత్సరాలు ఉంటుందని, ముసలితనంతో చనిపోయిందని డీఎఫ్ఓ షేక్ ఖాదర్ బాషా తెలిపారు. జంతువులను రక్షించాలని ప్రజలకు సూచించారు.